📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్వినాయకుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

వినాయకుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

📰 Generate e-Paper Clip

వినాయకుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

2వ వార్డు కౌన్సిలర్ భూక్యా శారద రాజు నాయక్

ఎల్లంపేట, : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎల్లంపేట మున్సిపాలిటీ 2వ వార్డు ప్రజలకు, మున్సిపల్ ప్రజలకు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులకు కౌన్సిలర్ భూక్యా శారద రాజు నాయక్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలని వినాయకుడిని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు. వినాయక చవితి వేడుకలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆమె కోరారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని, ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ మంచి జరగాలని కౌన్సిలర్ భూక్యా శారద రాజు నాయక్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.