📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamకొడుకు చావుకు న్యాయం కావాలి

కొడుకు చావుకు న్యాయం కావాలి

📰 Generate e-Paper Clip

కొడుకు చావుకు న్యాయం కావాలి”…!

ముదిగొండలో కన్నీరుమున్నీరవుతున్న కన్నతల్లి ఆవేదన…?

జిల్లాను కుదిపేస్తున్న వినయ్ కుమార్ ఆత్మహత్య ఉదంతం

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

బ్లాక్‌మెయిలర్ల వేధింపులు, ఆపై పోలీసుల లాఠీదెబ్బలు… తట్టుకోలేక నా కొడుకు ప్రాణం తీసుకున్నాడు. ఐదు రోజులు గడుస్తున్నా మాకు న్యాయం జరగడం లేదు. మీలో ఒకడిగా నా కొడుకుని అనుకుని, ఈ కన్నతల్లికి న్యాయం చేయండి అన్నలారా, తమ్ముళ్లారా…” అంటూ మృతుడు వినయ్ కుమార్ తల్లి మెట్టెల ఆదిలక్ష్మి గొంతు తడారిపోయేలా, కన్నీరుమున్నీరవుతూ చేస్తున్న ఆర్తనాదాలు ముదిగొండ మండల ప్రజల హృదయాలను కలచివేస్తున్నాయి.

*అసలేం జరిగింది?*

స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఇద్దరు వ్యక్తులు చేసిన తీవ్రమైన బ్లాక్‌మెయిల్ కారణంగా వినయ్ కుమార్ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంతలోనే న్యాయం చేయాల్సిన పోలీసు వ్యవస్థ కక్షపూరితంగా వ్యవహరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి వినయ్‌ని, అతని తండ్రిని, అలాగే వినయ్ మేనమామను తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది.ఈ బ్లాక్‌మెయిల్ వేధింపులు, సమాజంలో పోలీసులు అందరి ముందు కొట్టడం వల్ల తమ కుటుంబ పరువు, మర్యాదలు గంగలో కలిసిపోయాయని వినయ్ కుమార్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. సమాజానికి మొహం చూపించలేక, అవమానాన్ని భరించలేక చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక నిండు ప్రాణం బలైపోయి ఐదు రోజులు గడుస్తున్నా, ఇంతవరకు బాధితులకు సరైన న్యాయం అందకపోవడంపై ముదిగొండ మండల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.బాధిత కుటుంబం మరియు ముదిగొండ మండల ప్రజల ప్రధాన డిమాండ్లు కొన్ని వినిపిస్తున్నాయి. ప్రధానంగా
*ఎస్ఐ ని తక్షణమే సస్పెండ్ చేయాలి*

వినయ్ ని, అతని తండ్రిని, మేనమామను చట్టానికి విరుద్ధంగా కొట్టి, ఆత్మహత్యకు కారణమైన స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ ని వెంటనే విధుల్లోంచి సస్పెండ్ చేయాలి.

*బ్లాక్‌మెయిలర్లకు కఠిన శిక్ష పడాలి:*

వినయ్ మరణానికి ముందస్తు కారణమైన, అతడిని బ్లాక్‌మెయిల్ చేసిన ఆ ఇద్దరు వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలి.

*ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి:*

దిక్కుతోచని స్థితిలో ఉన్న వినయ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి. వారిని అన్ని విధాలా ఆదుకుంటూ తక్షణమే భారీ ఆర్థిక సహాయం ప్రకటించాలి.

తమకు న్యాయం జరిగే వరకు, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు స్థానిక లోకల్ న్యూస్ ఛానెళ్లు, మీడియా ప్రతినిధులు, మరియు మండల ప్రజలు తమకు అండగా నిలబడాలని వినయ్ తల్లి ఆదిలక్ష్మి చేతులు జోడించి వేడుకుంటోంది. ఒక కన్నతల్లి ఆవేదనను ఆలకించి, ఉన్నతాధికారులు స్పందించి వినయ్ ఆత్మహత్యకు కారణమైన వారిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ముదిగొండ మండలం ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.