విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి
*లక్ష పది వేల నష్టం… బోరున విలపిస్తున్న రైతు..*
మద్దూరు సెప్టెంబర్ 1, ప్రజా వాణి,
మండలంలోని గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన రైతు కుక్కల రవి యొక్క పాడి గేదే మంగళ వారం ఉదయం విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు తెలిపారు.ఈ సందర్భంగా రైతు బోరున విలపిస్తు అప్పులు లక్ష పది వేల రూపాయలు పెట్టీ కొనుగోలు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో తాడు తెంపుకుని వెళ్లి అతి తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వైర్ కాలికి చుట్టుకొని విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి చెందినట్లు తెలిపారు.
*పేద రైతు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించాలి*
*గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనకచంద్రం*
పశు పోషణపై ఆధార పడి జీవిస్తున్న రైతు కుక్కల రవి పాడి గేదె మృతి చెందడంతో కుటుంబం రోడ్డున పడిందని కుటుంబాన్నీ ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని కోరారు.
విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి
RELATED ARTICLES

