📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్విద్యా రంగంలో మరో మైలురాయి: శ్రీ మహర్షి హైస్కూల్ కరస్పాండెంట్ బాలెబోయిన గురుమోహన్‌కు డాక్టరేట్ ప్రదానం

విద్యా రంగంలో మరో మైలురాయి: శ్రీ మహర్షి హైస్కూల్ కరస్పాండెంట్ బాలెబోయిన గురుమోహన్‌కు డాక్టరేట్ ప్రదానం

📰 Generate e-Paper Clip

 కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 5 ప్రజావాణి పట్టణ విద్యా రంగంలో ప్రముఖ పేరు గడించిన శ్రీ మహర్షి హైస్కూల్ కరస్పాండెంట్ బాలెబోయిన గురుమోహన్  ఉన్నత విద్యా రంగంలో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు.దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకటైన తమిళనాడులోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం వారి నుంచి ఆయన పీహెచ్‌డీ (డాక్టరేట్) పట్టాను అందుకున్నారు. విద్యాసంస్థల నిర్వాహకుడిగా ఉంటూనే, పట్టుదలతో ఆయన చేసిన పరిశోధనకు ఈ గుర్తింపు లభించింది.

ఆధునిక సాంకేతికతపై అద్భుత పరిశోధన

బాలెబోయిన గురుమోహన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమైన ఒక కీలకమైన అంశాన్ని పరిశోధన కోసం ఎంచుకున్నారు. (ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్ సాంకేతికత ద్వారా విద్యుత్ ప్రసార వ్యవస్థల స్థిరత్వాన్ని మెరుగుపరచడం) అనే అంశంపై ఆయన సుదీర్ఘ పరిశోధనలు సాగించారు. నేటి ఆధునిక కాలంలో విద్యుత్ సరఫరా అనేది నిరంతరాయంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా సాగడం చాలా ముఖ్యం. సాంకేతిక లోపాలు లేదా లోడ్ హెచ్చుతగ్గుల వల్ల విద్యుత్ గ్రిడ్‌లు విఫలమవ్వకుండా, వాటిని స్థిరంగా ఉంచేందుకు కృత్రిమ మేధస్సు  లో భాగమైన ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్  సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించవచ్చో ఆయన తన పరిశోధన ద్వారా నిరూపించారు. భవిష్యత్తులో విద్యుత్ రంగంలో వచ్చే పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించడానికి ఈ పరిశోధన ఎంతో దోహదపడుతుందని విద్యావేత్తలు కొనియాడారు.ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేయడం వెనుక తన గైడ్ (మార్గదర్శి),వీఐటీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.మగేశ్వరన్ప్రో త్సాహం ఎంతో ఉందని గురుమోహన్, కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకున్నారు.పరిశోధనలో ఎదురైన ప్రతి దశలోనూ ఆయన అందించిన విలువైన సలహాలు, సూచనల వల్లే తాను ఈ రోజు డాక్టరేట్ పట్టాను సాధించగలిగానని ఆయన పేర్కొన్నారు.పోరుమామిళ్ల లాంటి ప్రాంతంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, కరస్పాండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే గురుమోహన్ పీహెచ్‌డీ సాధించడంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఆయన సాధించిన ఈ ఘనత పట్ల పట్టణంలోని పలువురు విద్యావేత్తలు,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం,మిత్రులు,శ్రేయోభిలాషులు మరియు మహర్షి విద్యాసంస్థల సిబ్బంది ఆయనను కలిసి ఘనంగా అభినందించారు.ఒక విద్యాసంస్థ అధినేత స్వయంగా ఇలాంటి ఉన్నత శిఖరాలను అందుకోవడం విద్యార్థులకు,యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు.డాక్టరేట్ సాధించిన డా.బాలెబోయిన గురుమోహన్, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను,విజయాలను అందుకోవాలని వారంతా ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.