
బిక్కనూర్, సెప్టెంబర్ 9 ( ప్రజావాణి):
మండల కేంద్రంలోని పాత హరిజనవాడలో ఉన్న ప్రీ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్‌లను సర్పంచ్ రేఖ సుదర్శన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేసి, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కర్రోళ్ళ రాజు, మనిషా, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

