గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించిన చేవెళ్ల జోన్ డిసిపి యోగేష్ గౌతం……
రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 16. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల. మున్సిపల్ జోన్ డిసిపి. ఐపీఎస్ యోగేష్ గౌతమ్. బుధవారం చేవెళ్ల ఎస్ హెచ్ ఓ తో కలిసి గుండాన్ని సందర్శించి జరగబోయే గణేష్ విగ్రహ నిమజ్జనానికి సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా డిసిపి గుండం అనుసంధాన రహదారులు. పార్కింగ్ స్థలాలు. భారీకేడ్ పాయింట్లు. నిమజ్జన ప్రదేశాలను పరిశీలించారు. నిమజ్జనం సజావుగా శాంతియుతంగా జరిగేలా శాంతిభద్రతల నిర్వహణ ట్రాఫిక్ మళ్లింపు. జన సమూహ నియంత్రణ. పోలీస్ సిబ్బంది మోహరింపు. బారికేడింగ్ లైట్ ఏర్పాట్లు. భద్రత చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇతర శాఖల సమన్వయంతో చేపడుతున్న కార్యచరణ ప్రణాళిక ముందు జాగ్రత్త చర్యల గురించి చేవెళ్ల ఎస్ హెచ్ ఓ. డీసీపీకి వివరించారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డీసీపీ ఆదేశించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు నిర్వాహకులు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులకు పూర్తిగా సహకరించాలని అధికారులు సూచించారు
సమాప్తం…….


