📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅంగన్వాడికి కేంద్రానికి తాళం వేసిన ఇంటి యజమాని.

అంగన్వాడికి కేంద్రానికి తాళం వేసిన ఇంటి యజమాని.

📰 Generate e-Paper Clip

అంగన్వాడికి కేంద్రానికి తాళం వేసిన ఇంటి యజమాని.

 

అద్దె చెల్లించని అధికారులు.

 

హుజూర్నగర్ సెప్టెంబర్ 9 (ప్రజావాణి)

 

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల పరిధిలోని అమరవరం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి ఇంటి యజమాని తాళం వేసిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది నెలలుగా ప్రభుత్వం నుంచి అద్దె బకాయిలు విడుదల కాకపోవడంతో విసుగు చెందిన భవన యజమాని అంగన్వాడి కేంద్రానికి తాళం వేసినట్లు సమాచారం.

ఈ చర్య వల్ల కేంద్రం పరిధిలోని గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు రోజువారీ అందాల్సిన పౌష్టికాహార పంపిణీ నిలిచిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వం అందించే గుడ్లు, బాలామృతం వంటి పోషకాహారం అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రం మూతపడటంతో పిల్లలు, మహిళలు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, మహిళల ఆరోగ్య పరిరక్షణకు కీలకమైన అంగన్‌వాడీ కేంద్రం ఇలా అద్దె బకాయిల కారణంగా మూతపడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు మరియు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, పెండింగ్‌లో ఉన్న అద్దె బకాయిలను వెంటనే చెల్లించి కేంద్రాన్ని పునఃప్రారంభించాలని గ్రామస్తులు, లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. పోషకాహార పంపిణీలో ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.