📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవార్షిక తనిఖీల్లో పోలీస్ స్టేషన్ల పరిశీలన

వార్షిక తనిఖీల్లో పోలీస్ స్టేషన్ల పరిశీలన

📰 Generate e-Paper Clip

వార్షిక తనిఖీల్లో పోలీస్ స్టేషన్ల పరిశీలన

నేర నియంత్రణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

జయశంకర్ భూపాలపల్లి /మహాముత్తారం, సెప్టెంబర్ 29 మన ప్రజావాణి : వార్షిక తనిఖీల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ మహాముత్తారం పోలీస్ స్టేషన్‌తో పాటు కాటారం సర్కిల్ కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, ఆయుధాగారం, సీసీటీవీ కెమెరాల పనితీరు, పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది టర్న్‌అవుట్, క్రమశిక్షణ తదితర అంశాలను పరిశీలించి, అధికారులు మరియు సిబ్బందితో మాట్లాడారు.

పోలీసింగ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ఎస్పీ సూచించారు. CCTNS 2.0, ఈ-సాక్ష్య, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ దర్యాప్తు, సోషల్ మీడియా మానిటరింగ్ వంటి సాంకేతిక విధానాలను సమర్థవంతంగా ఉపయోగించి నేరాల దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.

డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సకాలంలో పరిష్కరించి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు పోలీసుల ఉనికి స్పష్టంగా కనిపించేలా విజిబుల్ పోలీసింగ్, నిఘా పెట్రోలింగ్‌ను పెంచాలని ఎస్పీ తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత

పోలీస్ స్టేషన్, కాటారం సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మొక్కలు నాటారు. పోలీస్ కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచాలని సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కాటారం సీఐ నాగార్జునరావు, మహాముత్తారం ఎస్ఐ రమేష్‌తో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.