కస్తూర్బా పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించిన సర్పంచ్, ఎంపీడీవో
గరిడేపల్లి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి):
గరిడేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య గౌడ్, ఎంపీడీవో సరోజ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు.
విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను స్వయంగా తనిఖీ చేసి, వాటి నాణ్యత, పరిశుభ్రతపై ఆరా తీశారు. పాఠశాల పరిసరాలను, వంటగదిని పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ మాతంగి సంజీవ తదితరులు పాల్గొన్నారు.

