వంగపల్లి క్రాస్ రోడ్డు ప్రమాదాలకు నిలయం
ప్రజావాణి సెప్టెంబర్ 10 కమలాపూర్ మండలం వంగపల్లి క్రాస్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుంది
వంగపల్లి క్రాస్ యూటర్న్ తీసుకునే వాహనాల రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
వంగపల్లి వైపు నుంచి కమలాపూర్ వైపు వెళ్లే గ్రానైట్ లారీలు ఇతర లారీ వాహనాలతో పాటు బస్సులు చిన్న వాహనాలు సైతం నిబంధనలకు విరుద్ధంగా నేరుగా కమలాపూర్ రోడ్డుకు మల్తున్నాయని స్థానికులు చెబుతున్నారు దీంతో కమలాపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వంగపల్లి క్రాస్ వద్ద ప్రమాదాలు నిలయాలకు గతంలో యూటర్న్ ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ ఇప్పటికి సరైన హెచ్చరికలు బోర్డులు స్పష్టమైన రోడ్డు సూచనలు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఈ సమస్యలపై గతంలో పలుమార్లు కథనాలు ప్రచురించినప్పటికీ అధికారులు స్పందించలేకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
ప్ర
మాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ప్రమాదం జరగ ముందే సమస్యను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం మంచిదాని ప్రజలు అభిప్రాయపడుతున్నారు వంగపల్లి క్రాస్ వద్ద ప్రమాదాల నిలయాలకు వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి యూటర్న్ వద్ద వాహనాలు రాకపోకలకు క్రమబద్ధీకరించాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు

