📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

📰 Generate e-Paper Clip

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ శివునూరి వినోద్ మృతి

మేడ్చల్: ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన శివునూరి వినోద్ కుమార్ (29) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, గత నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:05 గంటలకు మృతి చెందాడు.

కొద్ది రోజుల క్రితం మజీద్‌పూర్ ఎక్స్‌రోడ్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం 12:05 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వినోద్ మృతితో రాజబొల్లారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.