మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు
రెండో రోజు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు గుర్రం శ్రీధర్ రెడ్డి
కీసర, సెప్టెంబర్ 16: కీసరలో మహారాజ్ యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కీసర డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం శ్రీధర్ రెడ్డి, బీఆర్‌ఎస్ కీసర గ్రామ శాఖ అధ్యక్షులు చినింగని బాలరాజుతో పాటు మొరుగు మహేష్, గోరింటి ప్రవీణ్, మహేష్, తిరుమల్, తుడుం బాలకృష్ణ, ఉదయ్, రాజు రెబెల్, అఖిల్, యశ్వంత్, తుడుం సాయి తదితరులు పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో కాలనీలో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నవరాత్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు మహారాజ్ యువసేన యూత్ అసోసియేషన్ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

