📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్*భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు*

*భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు*

📰 Generate e-Paper Clip

*భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు*

*పకడ్బందీ దర్యాప్తు.. బలమైన సాక్ష్యాధారాలతో నిందితురాలికి శిక్ష*

*శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్*

*మనోహరాబాద్ సెప్టెంబర్.21 మన మీ వార్త ప్రతినిధి* 

మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన హత్య కేసులో నిందితురాలికి జిల్లా ప్రధాన న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.6,000 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు.ఎస్పీ వివరాలు వెల్లడిస్తూ.. పర్కిబండ గ్రామానికి చెందిన మురళికి, మనోహరాబాద్‌కు చెందిన విజయలక్ష్మితో సుమారు 22 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ విషయాలపై తరచూ వివాదాలు జరుగుతుండటంతో మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామ పెద్దల సమక్షంలో కూడా పంచాయతీలు నిర్వహించి ఇరువురికి నచ్చజెప్పారు.మురళికి సుమారు 18 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో అప్పటి నుంచి పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.ఈ క్రమంలో 15.03.2021 రాత్రి మురళి మంచంపై నిద్రిస్తున్న సమయంలో విజయలక్ష్మి రోకలిబండతో అతనిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 16.03.2021న అప్పటి మనోహరాబాద్ ఎస్‌ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అప్పటి దర్యాప్తు అధికారి తూప్రాన్ సీఐ స్వామిగౌడ్ పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రస్తుత దర్యాప్తు అధికారి వెంకట రాజాగౌడ్,  ప్రస్తుత మనోహరాబాద్ ఎసై సుభాష్ గౌడ్ సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి కేసు విచారణను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు పబ్లిక్ గ్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు. పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితురాలికి జీవిత ఖైదుతో పాటు రూ.6,000 జరిమానా విధించారు. కేసు విచారణలో కోర్టు లైజన్ అధికారులు ఎస్సై విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సిడిఓ మహిపాల్ రెడ్డి సహకరించారు. నిందితురాలికి శిక్షపడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి పటిష్టమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో సమర్పించిన దర్యాప్తు అధికారులు కోర్టు లైజన్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.