📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు – విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలు -...

గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు – విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలు – జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం నిర్వహించేందుకు ప్రత్యేక భద్రతా చర్యలుజిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్లగొండ జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు మరియు ఇతర భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. గణేష్ విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు ముందుగానే తమ విగ్రహాల ఎత్తును పరిశీలించుకుని, నిర్దేశించిన నిమజ్జన ప్రదేశాలకు అనుగుణంగా రూట్ ప్లాన్ చేసుకోవాలని సూచించారు. సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) ఉన్నందున, 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న గణేష్ విగ్రహాలను ఈ సంవత్సరం 14 వ మైలు, హాలియా వైపు అనుమతించబడదు.

*విగ్రహాల ఎత్తును బట్టి నిమజ్జన మార్గాలు* :

*10 అడుగుల ఎత్తు వరకు ఉన్న విగ్రహాలు* :
బతుకమ్మ కుంట / వల్లభరావు చెరువులో నిమజ్జనం చేసుకోవాలి.
*10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు:*
క్లాక్ టవర్ – రామగిరి – పానగల్ ఫ్లైఓవర్ – తిప్పర్తి – వేములపల్లి మార్గం ద్వారా వేములపల్లి కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశంలో నిమజ్జనం చేసుకోవాలి. నిమజ్జన సమయంలో భక్తులు, నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలకు అనుగుణంగా ఊరేగింపులు నిర్వహించాలన్నారు. అలాగే డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, మద్యం సేవించి గణేష్ ఊరేగింపుల్లో పాల్గొనరాదని స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలను కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం (డ్రంకెన్ డ్రైవింగ్) చేయరాదని సూచించారు. ఈ సంవత్సరం “జీరో యాక్సిడెంట్ – జీరో ఇన్సిడెంట్” లక్ష్యంతో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.