📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKamareddyబైరాపూర్ లో ప్రపంచ ఆత్మహత్యల నివారణపై అవగాహన

బైరాపూర్ లో ప్రపంచ ఆత్మహత్యల నివారణపై అవగాహన

📰 Generate e-Paper Clip

  • బైరాపూర్ లో ప్రపంచ ఆత్మహత్యల నివారణపై అవగాహన

బీర్కూర్: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్యం ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్హెచ్పి ప్రీతీ మాట్లాడుతూ..

మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలతో కుంగిపోయే వారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలవాలని సూచించారు. సమస్యలను మనసులో దాచుకోకుండా విశ్వసనీయులతో పంచుకోవాలని, అవసరమైతే వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలని తెలిపారు.

ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారిని ఒంటరిగా వదిలేయకుండా వారికి ధైర్యం చెప్పి తగిన సహాయం అందించాలని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ ఆత్మహత్యల నివారణకు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధారాణి రాములు, ఉప సర్పంచ్ అజయ్, ఏఎన్ఎం కావ్య, ఆశ కార్యకర్తలు స్వరూప, జయ మరియు గ్రామ యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.