📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఉపాధ్యాయుల సేవలు అభినందనీయం

ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం

📰 Generate e-Paper Clip

ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం

కురవిలో 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి , సెప్టెంబర్ 10 ప్రజావాణి:

కురవి పి ఆర్ టి యు

మండల శాఖ ఆధ్వర్యంలో జడ్పీహెచ్‌ఎస్ కురవి పాఠశాల ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కురవి మండలంలో పనిచేస్తున్న 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమానికి కురవి మండల శాఖ అధ్యక్షులు వెంపటి సీతారాములు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కురవి మండల తహసీల్దార్ విజయ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అన్నారు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు వారిలో నైతిక విలువలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

విశిష్ట అతిథిగా హాజరైన పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా అధ్యక్షులు మిరియాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన 6 డీఏలను వెంటనే విడుదల చేయడంతో పాటు పీఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చాగట్లపూడి శ్రీధర్, మండల ప్రధాన కార్యదర్శి ఆకుతోట శివప్రసాద్, మాజీ అధ్యక్షులు తుడి వెంకటేష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, శ్యామల దేవి, దామోదర్, మధుసూదనాచారి, జిల్లా బాధ్యులు దాసరి శేఖర్, దేవేందర్, సునీత తదితరులతో పాటు పలువురు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.