బైరాపూర్ లో ప్రపంచ ఆత్మహత్యల నివారణపై అవగాహన
బైరాపూర్ లో ప్రపంచ ఆత్మహత్యల నివారణపై అవగాహన బీర్కూర్: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్యం ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్హెచ్పి ప్రీతీ మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలతో కుంగిపోయే వారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలవాలని సూచించారు. సమస్యలను మనసులో దాచుకోకుండా విశ్వసనీయులతో పంచుకోవాలని, అవసరమైతే వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలని...