📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetచాకలి ఐలమ్మకు ఘన నివాళులు

చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

 

భూమి కోసం.. భుక్తి కోసం.. పేదల విముక్తి కోసం పోరాటం

 

బెజ్జంకి, సెప్టెంబర్ 10 (ప్రజావాణి)

 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కత్తి రమేశ్ గౌడ్, రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమన్నారు. దేశ్‌ముఖ్‌లను, పోలీసులను ఎదిరించి తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యంగా పోరాడిన వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు.

ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, జెల్ల ప్రభాకర్ యాదవ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, రజక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.