📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబీజేఆర్ నగర్ గౌడ సంఘానికి నూతన కమిటీ.

బీజేఆర్ నగర్ గౌడ సంఘానికి నూతన కమిటీ.

📰 Generate e-Paper Clip

బీజేఆర్ నగర్ గౌడ సంఘానికి నూతన కమిటీ.

అధ్యక్షుడిగా దుబ్బాక రవీందర్ గౌడ్ ఎన్నిక.

జవహర్‌నగర్, సెప్టెంబర్ 13 ( ప్రజావాణి ప్రతినిధి వెంకటేష్ గౌడ్)

బీజేఆర్ నగర్‌తో పాటు పరిసర కాలనీలకు చెందిన గౌడ కులస్తులు సమావేశమై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా దుబ్బాక రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా మెరుగు బిక్షపతి, తండా ప్రభాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బండకింద భరత్ గౌడ్, కోశాధికారిగా దంతూరి శివకుమార్ గౌడ్, సహాయ కార్యదర్శిగా దుబ్బాక నవీన్ గౌడ్ ఎన్నికయ్యారు.
సలహాదారులుగా వడ్లకొండ వెంకటేశ్వర్లు, మొక్తల శంకరయ్య గౌడ్, పుట్ట బిక్షపతి గౌడ్, కార్యవర్గ సభ్యులుగా బి.ఈశ్వర్ గౌడ్, బి.కృష్ణ గౌడ్, ఎన్.వెంకన్న గౌడ్, దంతూరి రజినీకుమార్ గౌడ్ ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు దుబ్బాక రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘంలోని సభ్యులందరి అభిప్రాయాలను తీసుకుంటూ, అందరినీ కలుపుకొని సంఘాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని అన్నారు. అధ్యక్ష పదవిని బాధ్యతగా స్వీకరించి సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.