ప్రాజెక్టుల రూపుశిల్పి మోక్షగుండం విశ్వేశ్వరాయ జయంతి వేడుకలు: బద్వేలులో ఘనంగా నిర్వహణ
బద్వేలు:సెప్టెంబర్ 15 ప్రజావాణి స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సంఘ సలహాదారు ధనుంజయ రావు ఆధ్వర్యంలో మహోన్నత ఇంజనీర్,భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులందరూ కలిసి విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి,చేతులెత్తి మొక్కి ఘన నివాళులర్పించారు. ఆయన సేవలు మరువలేనివి: ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన సలహాదారు ధనుంజయ రావు మాట్లాడుతూ,ఆధునిక భారతదేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య చేసిన సేవలను కొనియాడారు. భగవంతుడు మనకు నీటిని ప్రసాదిస్తే,ఆ నీటిని ప్రజలకు ఉపయోగపడేలా ఎక్కడికి...