EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రభుత్వ కార్యాలయాలు వెంటనే నిర్మించాలి

ప్రభుత్వ కార్యాలయాలు వెంటనే నిర్మించాలి

📰 Generate e-Paper Clip

 

 

* సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్

 

జమ్మికుంట సెప్టెంబర్ 9 (ప్రజావాణి)

 

జమ్మికుంట మండలం నుండి పాలకులు పది సంవత్సరాల క్రితం ఇల్లందకుంట మండలంగా ఏర్పాటు చేసినప్పటికీ నేటికీ పక్కా ప్రభుత్వ భవనాలు నిర్మించకపోవడం సిగ్గుచేటని వెంటనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారుబుధవారం రోజున సిపిఎం పార్టీ ఇల్లందకుంట మండల కమిటీ సమావేశం తిప్పరపోయిన శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిందిఈ సమావేశానికి హాజరై వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా కొత్తగా మండలాలు ప్రకటించి విభజించినప్పటికీ నేటికీ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించకపోవడం పాలకుల దివాలా కోరు రాజకీయాలకు నిదర్శనం అన్నారుమండల రెవెన్యూ కార్యాలయం టెంపుల్ కళ్యాణ మండపంలో అసౌకర్యాల మధ్య కొనసాగుతుందని పోలీస్ స్టేషన్ టిటిడి అతిధి గృహంలో కొనసాగుతుందన్నారు మండల విద్యాధికారి కార్యాలయం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయలు రెండు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో నడపడం సిగ్గుచేటు అన్నారు

మండల వ్యవసాయ అధికారి కార్యాలయం రైతు వేదికలో కొనసాగించడం శోచనీయమన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చదువులు చెప్పాల్సిన తరగతి గదుల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగించడం పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా కనిపిస్తుందన్నారుదేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన టిటిడి అతిధిగృహం పోలీస్ స్టేషన్కు నిలయంగా మారడం విచారకరమన్నారునాటి టిఆర్ఎస్ ప్రభుత్వంనేటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా మండలంలో ప్రజల సౌకర్యార్థం నూతన భవనాలు నిర్మించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు.అనేక దఫాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఈటెల రాజేందర్ కూడా మండలాన్ని పూర్తిగా విస్మరించారని మండల ప్రజల ఆగ్రహానికి పాలకులు గురికాక తప్పదు అన్నారువెంటనే రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ మండలం కేంద్రంలో నూతన ప్రభుత్వ భవనాలు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలనిడిమాండ్.చేశారుమండలంలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తును నిరంతరాయంగా ఏలాంటి కోతలు లేకుండా సరఫరా చేయాలనిడిమాండ్.చేశారుఈనెల పది నుండి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు వీధి వీధినగ్రామ గ్రామాన జరుపుకోవాలన్నారుభూమికోసం భుక్తి కోసం పెట్టి చాకిరి విముక్తి కోసం నాడు సాగిన విరోచిత చారిత్రాత్మకమైన పోరాటాన్ని నేటి తరానికి అందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు

దొరలకుభూస్వాములకు జాగీర్దార్లకు జమీందారులకు, వ్యతిరేకంగా నాడు సాగించిన పేద ప్రజల సాయుధ పోరాటంతో 10 లక్షల ఎకరాల భూమి పేదల పరమైందన్నారు

ఆ పోరాటంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా దున్నేవానికి భూమి దక్కాలని పోరాటం నిర్వహిస్తే, ఆ పోరాటంలో ఇసుమంతైన పాత్ర లేని బిజెపిఆర్ఎస్ఎస్ శక్తులు హిందూముస్లిం కొట్లాటగా చిత్రీకరిస్తూ ఉద్యమాన్నివక్రీకరిస్తున్నాయన్నారు. బిజెపి వక్రభాష్యాలను తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారుఈనెల 11న జిల్లా కేంద్రంలో నిర్వహించే సిపిఎం సీనియర్ నాయకులు అఖిలభారత రైతు సంఘం ఉపాధ్యక్షులు అమరజీవి కామ్రేడ్ సారంపెళ్లి మల్లారెడ్డి సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.

స్థానిక సమస్యలపై ఎక్కడికక్కడ అనునిత్యం,ప్రజల పక్షాన ఆందోళన పోరాటాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి చెల్పూరి రాము మండల కమిటీ సభ్యులు కొత్తూరి మల్లయ్య గ్యారంపల్లి సంతోష్ జముఖం వెంకన్న, రమేష్ వెంకటేశ్వర్లు

తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.