ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక రోగికి ఇబ్బందులు.
మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంతిని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రచ్చపెల్లి గ్రామానికి చెందిన కలగూర రాజయ్య అనే వ్యక్తి నెల రోజుల నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాలా ఇబ్బందులకు గురవుతున్నానని చెప్పాడు గ్రామంలో నా సొంత పనుల కోసం బైక్ పై వెళ్లి వస్తుంటే అదుపుతప్పి కింద పడిపోవడంతో కాలుకు చిన్న మేకు దిగిందని దానికోసం మంతిని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే దానికి ఆపరేషన్ చేయాలని నెల రోజుల నుండి నన్ను తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు అసలే నేను కూలి పని చేసుకుని బతికే వాడినని రోజు ఆసుపత్రి తిరగాలంటే చాలా కష్ట మౌతుందని అన్నాడు ఇప్పటికైనా డాక్టర్లు స్పందించి నాకు వెంటనే తగిన వైద్యం అందించాలని కోరుతున్నాడు

