ప్రజావాణికి 11 ఫిర్యాదులు

*ప్రజావాణికి 11 ఫిర్యాదులు* *సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం* అధికారులు నంగునూరు, సెప్టెంబర్ 28: నంగునూరు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో సీహెచ్‌. శ్రీనివాస్‌, తహశీల్దార్‌ ప్రవీణ్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా మొత్తం 11 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌ కమిటీ పరిధిలోని 10 షట్టర్లకు రీ-టెండర్‌ నిర్వహించి నిజమైన వ్యాపారులకు అవకాశం కల్పించాలని...