పోరుమామిళ్లలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు: భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన ప్రముఖులు

పోరుమామిళ్ల:సెప్టెంబర్ 17ప్రజావాణి పట్టణంలో విశ్వకర్మ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో,అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో వెలసిన విశ్వకర్మ భగవానుని విగ్రహానికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు,హోమాలు,అభిషేకాలు జరిపారు.నూతన వస్త్రాలంకరణతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ వేడుకల్లో బద్వేల్ ఏఎంసీ చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మన సుబ్బరాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.సృష్టికర్త అయిన విశ్వకర్మ...