పోతంగల్లో హకీమ్ తాతయ్య కానుక పేరుతో ఆర్థిక సహాయం అందజేత.
ఆడపిల్ల పుడితే భారం కాదు భగవంతుని వరమే.
డాక్టర్ ఎంఏ.హకీమ్.
కోటగిరి/ప్రజావాణి:-ఆడపిల్ల పుట్టడాన్ని భారంగా భావించవద్దని ఆ భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరంగా భావించాలని బీఆర్ఎస్ నాయకులు,సామాజిక సేవకులు డాక్టర్ ఎం.ఏ.హకీమ్ పేర్కొన్నారు.సోమవారం పోతంగల్ మండల కేంద్రంలోని పాత పోతంగల్‌కు చెందిన గౌర్ నిషిత నాగరాజు దంపతులకు ఆడబిడ్డ జన్మించడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు,సామాజిక సేవకులు డాక్టర్ ఎం.ఏ.హకీమ్ తాతయ్య కానుక పేరుతో ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎం.ఏ.హకీమ్ మాట్లాడుతూ.ఆడపిల్ల భగవంతుడు ఇచ్చిన గొప్ప వరమని.ఆడబిడ్డ పుట్టిన కుటుంబాలు నిరాశ చెందకుండా సంతోషంగా స్వాగతించాలన్నారు.పోతంగల్ మండలంలోని పేద కుటుంబాలకు ఆడబిడ్డ జన్మించినప్పుడు తనకు సమాచారం అందిస్తే తనవంతు సహాయం అందిస్తానని ఆయన స్పష్టం చేశారు.ఆడపిల్ల భారమేమీ కాదని కుటుంబానికి,సమాజానికి భవిష్యత్తులో గర్వకారణంగా నిలిచే వారని ఆయన పేర్కొన్నారు.ఈ పాపకు ఆయురారోగ్యాలు కలిగి,ఉన్నతంగా ఎదగాలని కుటుంబ సభ్యులు,గ్రామస్థులు ఆకాంక్షించారు.

