📄 ePaper
Epaper 2
Thursday, September 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపేదలకు సి.యమ్ రిలీఫ్ ఫండ్ ఊరట

పేదలకు సి.యమ్ రిలీఫ్ ఫండ్ ఊరట

📰 Generate e-Paper Clip

పేదలకు సి.యమ్ రిలీఫ్ ఫండ్ ఊరట
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 24, ప్రజావాణి:

అనారోగ్య సమస్యలతో కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకుని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సి.యమ్ రిలీఫ్ ఫండ్ నిధులు పెద్ద ఊరటనిస్తాయని
కురవి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలగాని శ్రీనివాస్ గౌడ్, కురవి గ్రామ పార్టీ అధ్యక్షుడు నారాయణ రాజేందర్ కుమార్ ఆన్నారు.
గురువారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ సహకారంతో
రూ.4.10 లక్షలు మంజూరు చేశారని వారు తెలిపారు లబ్ధిదారులు
మామిడాల వెంకటేష్‌కు రూ.24,500, అంగడి మంగమ్మకు రూ.21,000, దూదికట్ల రఘుకు రూ.21,000, కాట్యాల వసంతకు రూ.16,500, మచ్చ అనసూర్యకు రూ.56,000, కానుగంటి లావణ్యకు రూ.22,500, దుర్బాకుల సరితకు రూ.32,500, కొణతం నవ్యకు రూ.1,75,000, దూదికట్ల సుజాతకు రూ.22,500 చొప్పున సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు వారు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కురవి మండల ఉపాధ్యక్షుడు ఆవిర మోహన్‌రావు, వార్డు సభ్యులు బాధే వీరభద్రం, దైద భద్రయ్య, మాజీ సర్పంచ్ తుకారం నాయక్, కురవి దేవస్థానం మెంబర్ చిన్నం గణేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంగడి నరసయ్య, బుక్క నాగరాజు, దూదికట్ల నాగేశ్వరరావు, BLA సంగెం నాగరాజు తదితరులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.