📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పెనుమూరులో ఘనంగా గురుపూజోత్సవం

పెనుమూరులో ఘనంగా గురుపూజోత్సవం

📰 Generate e-Paper Clip

పెనుమూరులో ఘనంగా గురుపూజోత్సవం

ఉత్తమ ఉపాధ్యాయుడు కె. నాగరాజు నాయుడుకు ఘన సన్మానం

పెనుమూరు(ప్రజావాణి ప్రతినిధి)సెప్టెంబర్ 5

పెనుమూరు మండలంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన కె. నాగరాజు నాయుడును ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి పెనుమూరు మండల టీడీపీ అధ్యక్షుడు పి. రుద్రయ్య నాయుడు, పెనుమూరు మాజీ సర్పంచ్ పెద్దినేని కృష్ణమూర్తి నాయుడు, పరమేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడు కె. నాగరాజు నాయుడుకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా రుద్రయ్య నాయుడు, కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులకు కేవలం విద్యను అందించడమే కాకుండా, వారిలో క్రమశిక్షణ, విలువలు, మంచి నడవడికను పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. గురువుల సేవలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
కె. నాగరాజు నాయుడు విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న సేవలను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయుడిగా సన్మానించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం గురువుల పట్ల గౌరవాన్ని చాటిచెప్పేలా ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.