📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguములుగు జిల్లాలో కోట్లకు పడగెత్తిన హోంగార్డ్

ములుగు జిల్లాలో కోట్లకు పడగెత్తిన హోంగార్డ్

📰 Generate e-Paper Clip

నక్సలైట్లను పట్టిస్తానంటూ నాడు హోంగార్డ్ ఉద్యోగంలోకి

ఎస్పీ గన్ మెన్ పేరుతో నేడు జిల్లాలో చలామణి

అవినీతి, అక్రమాలకు
కేరాఫ్ అడ్రస్ అతగాడే

గుట్కా, గుడుంబా వ్యాపారాల నుంచి మామూళ్ల వసూల్
అధికారుల అండదండలతోనే అతగాడి ఇష్టారాజ్య

సదురు హోంగార్డ్ పై చర్యలు చేపట్టాలని పలువురి వేడుకోలు.

*ములుగు జిల్లా ప్రజావాణి*

ములుగు జిల్లాలో ఓ హోంగార్డ్ కోట్లకు పడగెత్తిన తీరు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్నలను పట్టిస్తా అంటూ తిరిగి, ఆ తర్వాత హోంగార్డ్ ఉద్యోగం సంపాదించాడని, ఆనాటి నుంచి ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని నేటి వరకు జిల్లాలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అతడి ఆర్థిక పరిస్థితి అమాంతం మారిపోయిందని, సాధారణ హోంగార్డ్ జీతంతో సాధ్యం కాని స్థాయిలో ఆస్తులు కూడబెట్టాడని స్థానికులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కడ ఏ అక్రమం జరిగినా అతడి పేరు వినిపిస్తోందని, పోలీసు వ్యవస్థలో ఉన్న పలుకుబడిని అడ్డుపెట్టుకొని అక్రమార్కులకు అండగా నిలుస్తున్నాడనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు సామాన్యంగా తిరిగిన వ్యక్తి ఇప్పుడు కారులో తిరుగటం, భూములు కొనటం,ఆస్తులు కూడగట్టటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధికారుల అండదండలు లేకుండా ఒక హోంగార్డ్ ఇంత స్థాయికి ఎదగడం సాధ్యం కాదని, అందుకే జిల్లాలో అతడి దౌర్జన్యం కొనసాగుతోందని పలువురు పేర్కొంటున్నారు.

– గుట్కా, గుడుంబా వ్యాపారాల నుంచి నెల నెలా మామూళ్లు

జిల్లాలో సాగుతున్న గుట్కా, గుడుంబా వ్యాపారాల నుంచి నెల నెలా మామూళ్లు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు అతడిపై ప్రధానంగా ఉన్నాయి. గుట్కా, గుడుంబా విక్రయించే వారి వద్దకు వెళ్లి, తనకు తెలిసిన అధికారుల పేర్లు చెప్పి భయపెట్టి, నెలవారీగా డబ్బు వసూలు చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.డబ్బు ఇవ్వని వారిపై కేసులు పెట్టిస్తానని బెదిరించడం, ఇచ్చిన వారికి వ్యాపారం సజావుగా సాగేలా చూస్తున్నాడనే ఫిర్యాదులు సైతం వినిపిస్తున్నాయి. దీంతో అక్రమ వ్యాపారాలు జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్నాయని, వాటి వల్ల యువత, సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పోలీసు శాఖలో పనిచేస్తూనే, చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యక్తే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అండగా నిలబడటం దురదృష్టకరమని అంటున్నారు. మామూళ్ల దందా వల్లే అతడి సంపాదన కోట్లు దాటిందని, ఈ డబ్బుతోనే ఆస్తులు కూడబెడుతున్నాడని పలువురు పేర్కొంటున్నారు.

– ఏ వింగ్ లో విధులు నిర్వహిస్తాడో ఎవరికీ తెలియదు

అతగాడు పోలీస్ శాఖ లోని ఏ వింగ్ లో విధులు నిర్వహిస్తాడో కూడా జిల్లాలో ఎవరికీ తెలియదనే విషయం అతడి పలుకుబడికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.అధికారికంగా ఏ పోలీస్ స్టేషన్ లో, ఏ విభాగంలో డ్యూటీ చేస్తున్నాడో స్పష్టత లేకపోయినా, బయట మాత్రం ఎస్పీ గన్ మెన్ గా చెలామణి అవుతున్నాడని సమాచారం. ఎస్పీ గన్ మెన్ అనే పేరు చెప్పుకొని గ్రామాల్లో, పట్టణంలో హడావుడి చేస్తూ, సామాన్యులను భయపెడుతూ తిరుగుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులతో సన్నిహితంగా ఉంటాడనే భావనతో, కింది స్థాయి సిబ్బంది కూడా అతడిని ప్రశ్నించే సాహసం చేయడం లేదని తెలుస్తుంది.దీంతో అతడు ఎక్కడా డ్యూటీ చేయకుండానే, జీతం తీసుకుంటూ, బయట తన వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెప్పింది చేయని అధికారులపై ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ, వారిని కూడా ఇబ్బంది పెడుతున్నాడని, దీంతో చాలా మంది అధికారులు అతడితో గొడవ ఎందుకనే వారు మౌనంగా ఉంటున్నట్టు సమాచారం.

– కోట్లకు పైగా అక్రమ సంపాదన

ఏడాదికి చొప్పున 2 ఎకరాల భూమి కొనుగోలు చేస్తున్నాడని, ఇప్పటి వరకు కోట్లకు పైగా అక్రమ సంపాదన కూడబెట్టాడని స్థానికులు చెబుతున్నారు. హోంగార్డ్ గా వచ్చే స్వల్ప వేతనంతో ఇంత పెద్ద ఎత్తున భూములు, ఆస్తులు కొనుగోలు చేయడం సాధ్యం కాదని, దీని వెనుక మామూళ్ల దందానే ప్రధాన కారణమని అంటున్నారు. భూములతో పాటు ఇతర ఆస్తులు కూడా బినామీ పేర్లతో కొనుగోలు చేస్తున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి ఆస్తులపై సమగ్ర విచారణ జరిపితే అసలు లెక్కలు బయటపడతాయని, అధికారులు చిత్తశుద్ధితో విచారిస్తే కోట్ల రూపాయల అక్రమ సంపాదన బయటపడుతుందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

– అతగాడితో సామాన్యులకు తప్పని తిప్పలు

అతడి వ్యవహారం వల్ల పోలీస్ స్టేషన్ కు వివిధ పనులకు వచ్చే సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన బాధితులను భయపెట్టడం, అక్రమార్కులకు అనుకూలంగా వ్యవహరించడం, డబ్బు ఇస్తేనే పని అవుతుందనే పరిస్థితిని కల్పించడం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, అతడి విధులు, ఆస్తులు, మామూళ్ల వ్యవహారంపై లోతైన విచారణ జరిపి, తప్పు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసు శాఖ ప్రతిష్ఠను కాపాడాలని ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.