📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపుడమికి మేలు.. ప్రజల ఆరోగ్యానికి మేలు

పుడమికి మేలు.. ప్రజల ఆరోగ్యానికి మేలు

📰 Generate e-Paper Clip

*పుడమికి మేలు.. ప్రజల ఆరోగ్యానికి మేలు!*

ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్ బాట!

రైతులను ఆ దిశగా మళ్లించాలి…క్షేత్రస్థాయిలో అవగాహన పెంచాలి కలెక్టర్ స్నేహ శబరీష్!

.
34 మంది సీఆర్పీలకు ఐదు రోజుల శిక్షణ.. జీవామృతం, ఘనామృతం తయారీపై ప్రత్యేక అవగాహన!

కేసముద్రం సెప్టెంబర్ 26,ప్రజావాణి.

పంట దిగుబడితో పాటు నేల ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు.కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలోని జైపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జాతీయ మిషన్ ప్రకృతి వ్యవసాయం ఆధ్వర్యంలో 17 క్లస్టర్లకు చెందిన 34 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్‌ (సీఆర్పీ)లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ విధానాన్ని పరిశీలించారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను పెంచేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో సీఆర్పీలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, శాస్త్రవేత్తలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.

*జీవామృతం నుంచి గశపర్ణి కషాయం వరకు..!*

శిక్షణలో సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగంతో పాటు ఘనామృతం, జీవామృతం, బీజామృతం, గశపర్ణి కషాయం వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇస్తున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వీటిని ఎలా తయారు చేయాలి? పంటలకు ఎలా వినియోగించాలి? అనే అంశాలపై సీఆర్పీలకు క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తున్నారు.జైపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ జీవామృతం తయారీ యూనిట్‌ను కలెక్టర్ పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులకు చేరువ చేయడంలో ఇలాంటి శిక్షణలు, ప్రదర్శనా క్షేత్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

*రైతుకు ప్రతి ప్రయోజనం అందేలా కార్యాచరణ!*

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు, శిక్షణ, సబ్సిడీ ప్రయోజనాలను రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ శాఖ, విస్తరణ అధికారులు, ఉద్యానవన శాఖ, శాస్త్రవేత్తలు ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుని రైతులకు ప్రయోజనం చేకూరేలా పక్కా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, ఉద్యానవన శాఖ అధికారి జి. మరియాన్న, శాస్త్రవేత్త, హెచ్‌ఓడీ మల్యాల ప్రశాంత్, జైపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రామారావు, నాగేశ్వరరావు, తహసీల్దార్ వివేక్, వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.