📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్రూ.5.20 లక్షల డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్

రూ.5.20 లక్షల డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్

📰 Generate e-Paper Clip

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా నామినీకి క్లెయిమ్ మొత్తం అందజేత

కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ప్రధాన లక్ష్యం-

బ్రాంచ్ మేనేజర్ కాశబోయిన వీరస్వామి

 

బెజ్జంకి, సెప్టెంబర్ 28 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామానికి చెందిన థిప్పరవేణి రాజయ్య అనారోగ్య కారణాలతో 2026 ఏప్రిల్ 25న మృతి చెందారు. ఆయన 2024 డిసెంబర్ 19న టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని, వార్షిక ప్రీమియంగా రూ.52,786 చెల్లించారు. రాజయ్య మృతి అనంతరం ఆయన భార్య, నామినీ అయిన థిప్పరవేణి ఎల్లవ్వ క్లెయిమ్ దరఖాస్తును సమర్పించారు.క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేసిన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.5,20,000 డెత్ క్లెయిమ్ మొత్తాన్ని నామినీకి అందజేసింది. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ కార్యక్రమానికి కరీంనగర్ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ కాశబోయిన వీరస్వామి మాట్లాడుతూ.. కస్టమర్లు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. పాలసీ నిబంధనలకు అనుగుణంగా క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించడంలో టాటా ఏఐఏ ముందుంటుందని తెలిపారు. కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్లు శ్రీకాంత్, విజయ్‌కుమార్, పార్ట్నర్ గైనీ శ్రీకాంత్, బీఏ రాజేష్‌తో పాటు ఇతర టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

Previous article
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.