📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పాఠశాల కమిటీ ఎన్నికల్లో బీజేపీకి రెండు చోట్ల విజయం

పాఠశాల కమిటీ ఎన్నికల్లో బీజేపీకి రెండు చోట్ల విజయం

📰 Generate e-Paper Clip

పాఠశాల కమిటీ ఎన్నికల్లో బీజేపీకి రెండు చోట్ల విజయం

కూడేరు ప్రజావాణి సెప్టెంబర్29 మండలంలో జరుగుతున్న పాఠశాల కమిటీ ఎన్నికల్లో భాగంగా కొర్రకోడు ఉదిరిపి కొండ గ్రామాల్లోని ఎంపీపీ యూపీ పాఠశాలలో బీజేపీ మద్దతుతో.కొర్రకోడు బి. ఉమాదేవిఉదిరిపి కొండ లో ఎం. ఎర్రిస్వామి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు బోయ గోపాల్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోయిల రామాంజనేయులు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు బి. నాగేంద్ర తదితరులు ఉమాదేవికి శుభాకాంక్షలు తెలిపారు.
పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. కొర్రకోడు.ఉదిరిపి కొండ పాఠశాల కమిటీ ఎన్నికల్లో బీజేపీకి వైస్ చైర్మన్ పదవులు దక్కడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కమిటీ ఎన్నికల్లో బీజేపీకి విజయం దక్కడానికి సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్కు బీజేపీ నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తూ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తున్న జిల్లా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు.
రానున్న రోజుల్లో కూడా బీజేపీకి మరిన్ని విజయాలు దక్కాలని నాయకులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.