రాజు జీవించె రాతి విగ్రహములందు, కవియు జీవించె ప్రజల నాలికల యందు!”
నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్ డాక్టర్ గుఱ్ఱం జాషువా
పోరుమామిళ్ల సెప్టెంబర్ 29ప్రజావాణి పట్టణంలోని స్థానిక విజన్ కోచింగ్ సెంటర్ నందు సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ఈ వేడుకలు జరిగాయి.సాహిత్యాన్ని కేవలం వినోద సాధనంగా కాకుండా, సామాజిక సంస్కరణకు ఆయుధంగా మలచిన కవి సామ్రాట్, కళాప్రపూర్ణ డాక్టర్ గుఱ్ఱం జాషువా జయంతి వేడుకలు పోరుమామిళ్లలో అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకులు,’అక్షర శ్రీ’ యంబడి ఈశ్వర్, అధ్యక్షత వహించారు. ఆయన నేతృత్వంలో సభ అత్యంత ఉత్సాహభరితమైన, స్ఫూర్తిదాయకమైన వాతావరణంలో సాగింది.
సాహిత్య నీరాజనం – కవుల ప్రసంగాలు, కవితా గానo
ఈ జయంతి ఉత్సవాలు కేవలం ఒక సామాజిక వర్గానికి పరిమితం కాకుండా, సమాజంలోని అన్ని వర్గాల కవులు, రచయితల కలయికతో ఒక గొప్ప సాహిత్య సమ్మేళనంగా రూపాంతరం చెందాయి.ప్రముఖ మాదిగ సామాజిక వర్గ రచయిత శ్రీ చీపాటి రాజేశ్వర్,తో పాటు, మాదిగేతర ప్రముఖ కవులు, రచయితలైన డాక్టర్ రఫీ, బొల్లు రామమోహన్, కుందారపు గురుమూర్తి, మరియు నూనె శ్రీనువాసులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.కవులందరూ జాషువా, పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకుంటూ, ఆయన రాసిన ప్రసిద్ధ కావ్యాలైన ‘గబ్బిలం’ఫిరదౌసి’ వంటి రచనల విశిష్టతను కొనియాడారు. జాషువా,జయంతిని పురస్కరించుకుని తాము ప్రత్యేకంగా రచించిన కవితలను తమదైన శైలిలో అద్భుతంగా వినిపించి, సభికులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన సాహిత్య సేవలను, సామాజిక సమానత్వం కోసం ఆయన పడిన తపనను కవులు తమ ప్రసంగాల ద్వారా గుర్తుచేశారు.జాషువా,ఆశయాలను నేటి తరానికి అందించడమే ధ్యేయంగా నిర్వాహక కమిటీ సభ్యులు ఈ వేడుకను విజయవంతం చేశారు. కమిటీ సభ్యులైన:శ్రీ తిరువీధి జయరాములు,శ్రీ ఈరీ బాలజోజీ, శ్రీ కమలాపురం ప్రసాద్,శ్రీ రాయపాటి పాపయ్య, శ్రీ ప్రసాద్, శ్రీ గుడిమే ఇన్నయ్య,వీరంతా సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, జాషువా,సాహిత్య స్ఫూర్తిని, ఆయన చూపిన సామాజిక చైతన్యాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని, సమాజంలో సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పాల్గొని తమ కవితలతో,ఆలోచనలతో సభను రంజింపజేసిన కవుల సేవలను నిర్వాహక కమిటీ ఘనంగా గుర్తించింది. సమాజానికి సాహిత్య సేవ చేస్తున్న కవులు శ్రీ చీపాటి రాజేశ్వర్,డాక్టర్ రఫీ, బొల్లు రామమోహన్,కుందారపు గురుమూర్తి,మరియు నూనె శ్రీనువాసులు,నిర్వాహక కమిటీ సభ్యులు శాలువాలతో కప్పి,ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎం ఈ ఎఫ్,నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో మాదిగ సామాజిక వర్గ ఉద్యోగులు, మేధావులు, యువకులు పాల్గొన్నారు.పాల్గొన్న వారిలో: రాయపాటి బాలయ్య, సగిలి గురయ్య,దాసరి పల్లె దేవరాజు,పోరుమామిళ్ళ నరసింహులు,యంబడి చంటి, విశ్రాంత ఉపాధ్యాయులు కుళ్ళాయప్ప,నారిపోగు సింహరాయలు, సగిలి జయచంద్ర, వీరపోగు కార్తీక్, మున్నెల్లి చిన్ను, యంబడి విశాల్, సగిలి రామ్, బొజ్జ దిలీప్, మరియు పొట్టిపోగు ప్రశాంత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
