📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపుట్టపహాడ్‌లో రూ. 51 వేలకు వినాయక లడ్డూ కైవసం

పుట్టపహాడ్‌లో రూ. 51 వేలకు వినాయక లడ్డూ కైవసం

📰 Generate e-Paper Clip

పుట్టపహాడ్‌లో రూ. 51 వేలకు వినాయక లడ్డూ కైవసం.. దక్కించుకున్న మాజీ ఎంపీటీసీ చిల్ల వెంకన్న దంపతులు!

పరిగి, సెప్టెంబర్ 25 (ప్రజావాణి):

కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామివారి లడ్డూ ప్రసాదం వేలంపాట భక్తుల జయజయధ్వానాల నడుమ అత్యంత ఉత్సాహంగా సాగింది. గ్రామంలోని ‘హిందూ ఉత్సవ కమిటీ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేలంపాటలో స్థానిక మాజీ ఎంపీటీసీ చిల్ల వెంకన్న, సుభద్ర దంపతులు హోరాహోరీ పోటీ నడుమ రూ. 51,000 వేలం పాడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.
గ్రామంలో నిర్వహించే ఉత్సవాలకు వరుసగా మూడు సంవత్సరాలుగా వినాయక విగ్రహాన్ని స్వయంగా సమకూర్చి (దాతగా వ్యవహరించి) తన భక్తిభావాన్ని చాటుకుంటున్న చిల్ల వెంకన్న, ఈసారి లడ్డూ ప్రసాదాన్ని కూడా సొంతం చేసుకోవడం పట్ల గ్రామస్తులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో గ్రామం సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా వెంకన్న దంపతులు ఆకాంక్షించారు.
ఉత్సవాల విజయవంతానికి నిరంతరం తోడ్పడుతున్న దాత చిల్ల వెంకన్న దంపతులకు, సహకరించిన భక్తులకు హిందూ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, యువజన సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.