పద్మశాలి ఐక్యతకు అభినందనీయ
* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట సెప్టెంబర్ 23 (ప్రజావాణి)
జమ్మికుంట పట్టణ పద్మశాలి సేవా సమితి పద్మశాలి కుల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అరకాల వీరేశలింగం ఎన్.ఎం.రమేష్ పద్మశాలి ఎన్నికలలో పోటీలో ఉండగా పద్మశాలి ఐక్యతను చాటుతూ పరస్పర గౌరవంతో ఈరోజు ఎన్.ఎం.రమేష్ స్వచ్ఛందంగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటూ ఎన్నికల అధికారులకు లేఖ సమర్పించడంతో పాటు అరకాల వీరేశలింగం ఎన్నికకు తన పూర్తి మద్దతును ప్రకటించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ పద్మశాలి సమాజ ఐక్యత కోసం తీసుకున్న మంచి నిర్ణయం అని తెలుపుతూ పద్మశాలి కులబంధవులకు నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని నా కుటుంబాన్ని రెండు పర్యాయాలు గెలిపించారని ఇప్పుడు కూడా 23వ వార్డు నా గెలుపులో పద్మశాలి కులబంధవుల పాత్ర కీలకం అని తెలుపుతూ ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికైన అరుకాల వీరేశలింగం కి శుభాకాంక్షలు తెలుపుతూ పద్మశాలి కులబండవులందరూ ఎల్లప్పుడూ ఐక్యత ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దిడ్డీ రాము అభ్యర్థి ఎన్.ఎం. రమేష్ కొండ శ్రీధర్ కొండి రమేష్ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

