📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనా కుటుంబమే కాదు.. సంగారెడ్డి ప్రజలందరూ నా కుటుంబమే

నా కుటుంబమే కాదు.. సంగారెడ్డి ప్రజలందరూ నా కుటుంబమే

📰 Generate e-Paper Clip

నా కుటుంబమే కాదు.. సంగారెడ్డి ప్రజలందరూ నా కుటుంబమే

సంగారెడ్డి, సెప్టెంబర్ 27: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తానని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన గణపతి నిమజ్జన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ వద్ద చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక లడ్డూ వేలం పాటలో జగ్గారెడ్డి పాల్గొని రూ.21 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ వేలంపాటను సంగారెడ్డి ప్రజలందరి తరఫున పాడినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. “జగ్గారెడ్డి కుటుంబం అంటే నా భార్య, కొడుకు, కూతురు మాత్రమే కాదు.. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే” అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా తన ఆధ్వర్యంలో పండుగలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలంతా ఉత్సాహంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
వేలంలో దక్కించుకున్న లడ్డూ ప్రసాదాన్ని తన కుటుంబ సభ్యుల ద్వారా అక్కడికక్కడే ప్రజలకు పంచిపెట్టారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు సంగారెడ్డిలో జరిగిన గణపతి నిమజ్జన వేడుకలను జగ్గారెడ్డి పర్యవేక్షించారు.
కింది బజార్ చెరువు వద్ద భారీ క్రేన్ల ద్వారా గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పరిశీలించారు. విగ్రహాల ఊరేగింపు సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్వయంగా ఆటోలో, కాలినడకన తిరుగుతూ ట్రాఫిక్ నియంత్రణలో సహకరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.