*గాంధీ పార్క్లో ఘనంగా కాంగ్రెస్ సేవాదళ్ జెండా ఆవిష్కరణ…*
*ఆవిష్కరించిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 28.*
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు , మహాత్మా గాంధీజీ ఆశయాలు , సేవాదళ్ సేవా స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యం తో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్య క్రమంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ సోమవారం రోజు జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్ సేవాదళ్ దే అన్నారు. నేడు భారతీయ జనతా పార్టీ ఫేక్ వీడియోలు చేస్తూ ఆ ప్రజాసామికంగా నెహ్రూ మీద , ఇందిరా గాంధీ మీద , జాతీయ నాయకులను కించపరిచే విధంగా వాస్తవాల్ని అవాస్తవాలుగా చూపిస్తూ చూపిస్తున్న భారతీయ జనతా పార్టీని గద్దధించి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ కాంగ్రెస్ సేవాదళ్ ముందు వరుసలో ఉండి పనిచేయాలి , జిల్లాలో నియోజకవర్గంలో మండలాలలో గ్రామాలలో వార్డులలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అవి నీతిపై ప్రజలకు తెలియ జేయాల్సిన బాధ్యత యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ సభ్యులు తీసుకొని ప్రజలకి తెలియ జేయాలని ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు షేక్ వాజీద్ , పీసీసీ డెలిగేట్ తంగళ్లపల్లి రవికుమార్ , మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జయంగీర్ , కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ , సేవా దళ్ రాష్ట్ర నాయకులు దరిపల్లి ప్రవీణ్ కుమార్ , 34 వ వార్డు కౌన్సిలర్ సరగడ అమరేందర్ రెడ్డి , సేవాదళ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుబ్బూరి శ్రీనివాస్ , సేవాదళ్ మాజీ అధ్యక్షులు సామల రవీందర్ , కాంగ్రెస్ సేవాదళ్ పట్టణ నాయకులు ఆడెపు రాజేశ్వర్ , సేవాదళ్ సెక్రటరీ డాకూరి ప్రకాశ్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ నజీర్ , మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ రఫీయుద్దీన్ గోరే , కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గుమ్మడెల్లి రమేష్ , కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు అంకం రాజు , బ్లాక్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు ఉప్పు నూతల రాజా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

