📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజాపాల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు

జాపాల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు

📰 Generate e-Paper Clip

*జాపాల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు*

*మంచాల మండలం ఫోరం సర్పంచ్ అధ్యక్షుడు* .

*మంచాల రవి*

మంచాల మండలం సెప్టెంబర్ 28 (ప్రజావాణి)జాపాల: గ్రామంలోని ఎస్సీ కాలనీలో అండర్‌డ్రైనేజీ పనులను గ్రామ సర్పంచ్ మంచాల రవి ప్రారంభించారు. విడతల వారీగా గ్రామాభివృద్ధి పనులను చేపడుతూ ప్రతి కాలనీకి మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రజలకు మెరుగైన జీవన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.

అండర్‌డ్రైనేజీ పనులు పూర్తయితే మురుగునీటి సమస్య తగ్గడంతో పాటు పారిశుధ్యం మెరుగుపడి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు. పనుల నాణ్యతపై అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షణ చేయాలని, స్థానికులు కూడా పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా గమనించాలని సూచించారు.

గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టకపోతే ప్రజలు సమస్యలను గ్రామపంచాయతీ సమావేశాల్లో అధికారికంగా ప్రస్తావించాలి. సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు, గ్రామసభలో తీర్మానం చేయించి పనుల కోసం ప్రతిపాదనలు పంపించాలి. అవసరమైతే మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి, జిల్లా పంచాయతీ అధికారులను సంప్రదించి సమస్య పరిష్కారానికి చర్యలు కోరవచ్చు. ప్రజలు ఐక్యంగా, శాంతియుతంగా తమ హక్కులను వినియోగించుకోవడంతో పాటు, అభివృద్ధి పనుల్లో పారదర్శకత, నాణ్యత ఉండేలా పర్యవేక్షణ చేయాలి.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బియ్యని ప్రభావతి సతీష్, 3వ వార్డు సభ్యురాలు మంగ, 5వ వార్డు సభ్యురాలు మంథని పార్వతాలు, 6వ వార్డు సభ్యుడు ఒరిగంటి భాస్కర్, 7వ వార్డు సభ్యుడు యాట ముత్తయ్య, 10వ వార్డు సభ్యుడు నోముల లింగం, పంచాయతీ కార్యదర్శి మురళీమోహన్‌తో పాటు కాలనీ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

— మంచాల రవి
సర్పంచ్, జాపాల గ్రామం
మంచాల మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.