నంగునూరు, సెప్టెంబర్ 7 (ప్రజావాణి):
నంగునూరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మొత్తం 41 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో శ్రీనివాస్, తహశీల్దార్ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి 25, హౌసింగ్ శాఖకు 3, ఎంపీడీవో కార్యాలయానికి 2, తహశీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయానికి 9, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు 1, ఎక్సైజ్ శాఖకు 1 దరఖాస్తు వచ్చినట్లు అధికారులు వివరించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు పంపించి, నిబంధనల మేరకు సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన స్పందించాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం లభిస్తుండడంతో వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
నంగునూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ప్రజావాణి కార్యక్రమానికి 41 దరఖాస్తులు సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించాలి
RELATED ARTICLES

