*దేశభక్తి బృందగాన పోటీల్లో ఎస్‌కేఎం హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ*
*జానపద, ప్రాంతీయ విభాగంలో ద్వితీయ బహుమతి.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక*
మేడ్చల్,ప్రజావాణి:
గుండ్ల.పోచంపల్లి పరిధిలోని మునీరాబాద్‌లోని ఎస్‌కేఎం హైస్కూల్ విద్యార్థులు భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుభాష్‌నగర్‌లోని శ్రీ గాయత్రి స్కూల్‌లో నిర్వహించిన దేశభక్తి బృందగాన పోటీల్లో ప్రతిభ కనబరిచారు. జానపద, ప్రాంతీయ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హిందీ, సంస్కృత విభాగంలో తృతీయ బహుమతి పొందారు.
ఈ కార్యక్రమానికి భారత వికాస్ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు పసుపులేటి నరేంద్ర కృష్ణ, ప్రధాన కార్యదర్శి శివ రామకృష్ణ, సేవా కన్వీనర్ కట్టే శ్రీకాంత్, సంపర్క్ ప్రముఖ్ లవ కుమార్ గౌడ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు దేశభక్తి, జాతీయ భావాలు, దేశం పట్ల బాధ్యతపై అవగాహన కల్పించారు.
పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ శ్రుతి గౌడ్ అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కీర్తి, లలిత, వంశీ పాల్గొన్నారు.

