*తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా చెల్లోజు నవీన్ చారి*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రజావాణి):
తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా జనగామ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చెల్లోజు నవీన్ చారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆదివారం జనగామ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కార్యాలయంలో ఓదెల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్ములూరి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై నవీన్ చారికి నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నవీన్ చారి మాట్లాడుతూ… విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఐక్యత కోసం, జాతి అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా కుల సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు దిగోజు నరసింహ చారి, స్వర్ణకార సంఘం రాష్ట్ర నాయకులు నారోజు రామేశ్వర చారి, వలబోజు చక్రపాణి, విగోజు సాంబయ్య, బత్తుల సిద్దిరాములు, రాష్ట్ర నాయకులు కలకోటి వీరభద్ర చారి, ఓదెల సత్యనారాయణ, భక్తోజు రవికుమార్, వలబోజు బ్రహ్మచారి, కొండపాక విష్ణు, వర్ధమాన శ్రీహరి, నవీన్ వీర చారి, చెన్నోజు సాహిత్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

