📄 ePaper
Epaper 2
Sunday, September 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్డబిల్‌పూర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం

డబిల్‌పూర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం

📰 Generate e-Paper Clip

*డబిల్‌పూర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం*

*శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం*

*లడ్డూ వేలంపాటలో విజేతగా బీసీ సెల్ యువజన విభాగం అధ్యక్షుడు తలారి బాలరాజ్*

ఎల్లంపెట్ మున్సిపల్ (ప్రజావాణి):-ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్ గ్రామంలో శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, రాత్రి గణనాథుని నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డబిల్‌పూర్ కౌన్సిలర్లు విఘ్నేశ్వర్ రెడ్డి, సంజీవరావు, హరిఫ్, ముత్యాల గౌడ్, పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

*లడ్డూను వేలంపాటలో దక్కించుకున్న బిసి సెల్ యువజన అధ్యక్షుడు తలారి బాలరాజ్*

అనంతరం మండప నిర్వాహకులు ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. వినాయకుడి లడ్డూ వేలంపాట కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ వేలంపాటలో తలారి బాలకృష్ణ లడ్డూను దక్కించుకున్నారు. దీంతో మండపం వద్ద భక్తుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

*భక్తి శ్రద్ధలతో నిమజ్జనం*

అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం గణనాథుని విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు, ముదిరాజ్ సంఘ సభ్యులు పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.