దేశభక్తి బృందగాన పోటీల్లో ఎస్‌కేఎం హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ
*దేశభక్తి బృందగాన పోటీల్లో ఎస్‌కేఎం హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ* *జానపద, ప్రాంతీయ విభాగంలో ద్వితీయ బహుమతి.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక* మేడ్చల్,ప్రజావాణి:గుండ్ల.పోచంపల్లి పరిధిలోని మునీరాబాద్‌లోని ఎస్‌కేఎం హైస్కూల్ విద్యార్థులు భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుభాష్‌నగర్‌లోని శ్రీ గాయత్రి స్కూల్‌లో నిర్వహించిన దేశభక్తి బృందగాన పోటీల్లో ప్రతిభ కనబరిచారు. జానపద, ప్రాంతీయ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హిందీ, సంస్కృత విభాగంలో తృతీయ బహుమతి పొందారు. ఈ కార్యక్రమానికి భారత వికాస్ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు...