దేవాలయ భూముల కబ్జాపై భగ్గుమన్న గ్రామస్థులు
తక్షణమే సర్వే జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కు వినతి
తొర్రూరు మండలం
అమ్మాపురం గ్రామంలోని విలువైన ఆలయ భూములు అన్యాక్రాంతమవుతుండటంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం అమ్మాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో భూముల పరిరక్షణపై ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేసి స్థానిక క్వారీకి విక్రయించారని గ్రామస్థులు బహిరంగంగా ఆరోపించారు దీనితో పాటు అత్యంత పవిత్రమైన శ్రీరాముని ఆలయ భూములు సైతం అన్యాక్రాంతమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు
ఈ విషయాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆలయ భూములను రక్షించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
మరోవైపు గ్రామంలోని ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం గ్రామ ప్రజలంతా ఏకమై స్థానిక గ్రామ సర్పంచ్‌కు ఒక లిఖితపూర్వక వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామంలోని సర్వే నెంబర్ 7 లో గల పోరంబోకు సీతాముని గుట్ట భూమి అలాగే సర్వే నెంబర్ 9 లో ఉన్న కుంట భూమి ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రభుత్వానికే చెందుతాయని వారు వినతి పత్రంలో స్పష్టం చేశారు. అయితే కొందరు స్వార్థపరులు ఈ ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకుని అవి తమ సొంత భూములంటూ నమ్మబలుకుతూ ఇతరులకు విక్రయిస్తున్నారని సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి సర్పంచ్ అంశంపై వెంటనే స్పందించి సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి సర్వే నెంబర్ 7 , 9 భూములను తక్షణమే సర్వే చేయించాలని కోరారు ఈ భూముల హద్దులను ఖచ్చితంగా నిర్ధారించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని, కోరారు ఈ కార్యక్రమంలో యం. విక్రమ్ రెడ్డి, కే. అచ్చిరెడ్డి, జూలూరి.జగన్, యం. మహబూబ్ రెడ్డి,యం. సురేష్, కే. రమేష్, బి. వీరేష్,
యం. ఉపేందర్, యం.రాజు , మెరుగు సమ్మయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

