📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetదాచారం గ్రామంలో 800 మొక్కలు నాటిన సర్పంచ్

దాచారం గ్రామంలో 800 మొక్కలు నాటిన సర్పంచ్

📰 Generate e-Paper Clip

దాచారం గ్రామంలో 800 మొక్కలు నాటిన సర్పంచ్

 

పచ్చదనంతో గ్రామాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం

 

బెజ్జంకి, సెప్టెంబర్ 10 (ప్రజావాణి)

 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామాన్ని పచ్చదనంతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ బైరా మానస రాజేందర్ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటారు.ఎస్టీ కాలనీ రోడ్డు ఇరువైపులా మొదలుకొని స్మశానవాటిక ప్రాంగణం వరకు సుమారు 800 మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బైరా మానస రాజేందర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఎస్టీ కాలనీ నుంచి స్మశానవాటిక పరిసరాల వరకు పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటినట్లు తెలిపారు.

నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, క్రమం తప్పకుండా నీరు అందిస్తూ వాటిని పెంచుతామని చెప్పారు.గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు కూడా మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని, నాటిన ప్రతి మొక్కను ఒక బాధ్యతగా భావించి కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దీటి బాలనర్స్, వార్డు సభ్యులు గాదగోని అశోక్, సావనపల్లి రాజు, నేతి మహేష్, కనగండ్ల సోని, చెంద్రయ్య, ఓరుగల శంకర్, ఐల్లయ్య, రాజేశం, భాస్కర్, లింగం, బాలరాజు, మురళి, ఉపాధి హామీ కూలీలు, మేటి రమ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.