బిఆర్ఎస్ పై దళిత ఆత్మగౌరవ దండోరా మోగించాలి
దళిత పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా నిలుద్దాం..!
*గద్దల మహేందర్*
నిత్య చైతన్య భూమి నా తెలంగాణ
మద్దూరు సెప్టెంబర్ 10, ప్రజా వాణి,
అది సాయుధ పోరాటపు అనవాళ్లు కలిగిన భూమిపై అంటరానితనం వివక్షత పరోక్ష రూపం దాల్చి, నేడు దళితులపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం అవలంబిస్తున్న తీరు పట్ల సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తుందనీ గద్దల మహేందర్అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన ప్రతి పోరాటంలో ముందుండి, ప్రాణాలు వదిలిన వాళ్ళు ఆత్మగౌరవ నినాదంతో సాయుదులై తుపాకి తూటాలకు బలి అయిన వారు ఉన్నారు. సాయుధ పోరాటం నుండి మొదలై,శ్రీకాకుళం నక్సల్బరి తో పెనవేసి గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమం నుంచి కరీంనగర్ జగిత్యాల, సిరిసిల్ల కల్లోలాల ప్రాంతం నుంచి ఇంద్రవెల్లి అమరత్వం వరకు పెనుమంటలై, వరంగల్ భవనగిరి యుద్ధ నినాదమై, ప్రతి ఉద్యమంలో నా దళిత జాతి చైతన్యమై పోరాటం సాగించింది.పల్లెల్లో భూస్వామ్య వర్గాలు సాగించిన పెత్తందారులపై కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉద్యమించి బానిస విముక్తి పోరులో ఎందరో అమరులైన దళిత జాతి రత్నాలు. అలాంటి చరిత్ర కలిగిన జాతిపై మనువదా భావజాల మనస్తత్వం కలిగిన బిఆర్ఎస్ పార్టీ వారి నాయకత్వం ప్రజా సమూహంలో విచ్చలవిడిగా సంస్కృతిని, భాషను పక్కనపెట్టి పౌరుష పదజాలంతో దూషించడం అంటే అత్యున్నత గౌరవప్రదమైన పదవిలో కొనసాగుతున్న వారిపై ఎంత చిన్నచూపు ఉందో వారి మనస్తత్వం ఏమిటో అర్థం అయింది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ పై మొదలైన మాటల దాడి మొత్తం బిఆర్ఎస్ పార్టీ సాగించిన తీరు దళితుల పట్ల వారి ప్రేమ కనబడింది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడే సందర్భంలో బ్లాక్ టీ షర్ట్ వేసుకొని వాటిపై నినాదాలు ముద్రించుకొని రావడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాల్సిన సభ్యులు సహనం కోల్పోయి పోలీసులపై, దాడికి దిగారు.మహిళా పోలీసులతో దురుసుగా ప్రవర్తించి సీనియర్ శాసనసభ్యులు అర్ధ నగ్న ప్రదర్శన చేసి మహిళా లోకాన్ని కించపరిచేలా వ్యవహరించడం చూసాం. అంతటితో ఆగకుండా శాసనసభ సమావేశాలు జరగకుండా చేయాలనే ఒక ఎత్తుగడతో వీరు వ్యవహరించడం జరిగింది. వారి అసలు వ్యూహం ఏంటనేది ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము పాలకులుగా ఉండాలి తప్ప.! ప్రతిపక్షంలో ఉండకూడదనే ఒక ఆహాంకార దూర్పుదితో వారి తీరు కనబడుతుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా వ్యూహరచన చేసిన కేసీఆర్ వారికి ఎలాంటి దిశ, నిర్దేశం చేసారో బయటకు రావాలి. ఇక్కడ ప్రభుత్వం కెసిఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినందువల్ల అసెంబ్లీకి రావాలని కోరడంలో ఇలాంటి ఇబ్బంది లేదు. అది రాజ్యాంగపరమైన ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతున్న డిమాండే. కానీ కెటిఆర్ ఇతర సహచర సభ్యులు చేస్తున్న హంగామా మొత్తం తెలంగాణ సమాజాన్ని వ్యవస్థల్ని బ్రష్టు పట్టించే విధంగా ఉంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపాత్ర పోషించాల్సింది పోయి,వారి చేష్టలతో మాటలతో వ్యంగంగా ప్రవర్తించడం వెనక వీరి అగ్రవర్ణ మనువాద భావజాలం బయటపడింది.
స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కేసిఆర్ దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలనే డిమాండ్తో కాంగ్రెస్ దళిత పక్షం ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముట్టడికి పిలుపునిస్తే అక్కడ శాంతియుతంగా డబ్బులతో నిరసన తెలిపిన దళిత జాతి అడుగు జాడల్లో బిఆర్ఎస్ పార్టీ వాళ్లు ఇక్కడి ప్రాంతం మహిల పడిందని, పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అంటే అది దళిత జాతి గౌరవాన్ని కించపరిచినట్లుగా భావించాలి.ఇంత అహంకార పూరితమైన మాటలు వారి చేష్టలు జరుగుతున్న పరిణామాలు నిశితంగా చూసిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మొత్తం ఘటనపై విచారణకు ఆదేశించడం దళిత సమాజం పట్ల ఆయనకున్న నమ్మకం గౌరవం గమనించవచ్చు. ఆధునిక యుగములో శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందిన దేశంలో కులాలు మతాలు లేవని మనమంతా ఒకటేనని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చెబుతుంది. దాన్ని అమలు చేయలేని వాళ్ళు ఇక్కడ అగ్రవర్ణ మనువాద భావజాలాన్ని బిఆర్ఎస్ పెంచి పోషించిన సందర్భం కనిపిస్తుందన్నారు.
అంబేద్కర్ వారసులుగా ఆయన రాసిన రాజ్యాంగంపై దాడి జరుగుతుంది హక్కులు అనదొక్కబడుతున్నాయి. స్వేచ్ఛ,సమానత్వం సన్నగిల్లిపోయి దళితులను ఓటు బ్యాంకు గానే వాడుకొని, మళ్ళీ వారిని అంటరాని వారిగానే పరిగణిస్తున్న ఈ సమాజం పట్ల నిత్య చైతన్యం కావాల్సిన అవసరం ఏర్పడింది. మళ్లీ తెలంగాణలో భూస్వామ్య ఫ్యూడల్ మనువాద భావాజాలం బిఆర్ఎస్ ప్రభుత్వం హయాములోనే మొదలైందనట్టుగా కనిపిస్తోంది. వారు వ్యవరించిన తీరు,నేటి ఈ సంఘటనను గుర్తు చేస్తున్నాయి.ఆనాడు ఉద్యమ సమయంలో దళితులకు అనేక హామీలు ఇచ్చిన బిఆర్ఎస్ వాటి అమలులో ఎంత చిత్తశుద్ధితో ముందుకు సాగిందో గమనించాలి దళిత ముఖ్యమంత్రితో మొదలైన వారి హామీ మూడు ఎకరాల భూమితో సాగిన తీరు చివరికి మంత్రివర్గంలో దళితుల్ని ఇంటికి పంపించిన వైనం ఇసుక మాఫియాకు ఎదురు తిరిగిన నేరెళ్ల దళితులపై ఆనాటి మీ ప్రభుత్వం దర్ద్ డిగ్రీ ప్రయోగించి, వారి మానసిక హింసకు పాల్పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలకు ఆనాటి మీ ప్రభుత్వం మీ నాయకత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది కావున నేడు జరిగిన ఈ పరిణామాలన్నిoటికి బిఆర్ఎస్ నైతిక బాధ్యత వహించాలి.దళిత సమాజాన్ని కించపరిచేలా మాట్లాడిన వారిపట్ల రాజ్యాంగపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దళిత సమాజం వైపు నుండి విన్నవించుకుంటున్నామన్నారు.

