తోర్నాల మోయ తుమ్మెద వాగులో గంగమ్మ తల్లికి పూజలు చేసిన కాంగ్రెస్ నాయకులు
మద్దూరు సెప్టెంబర్ 28, ప్రజా వాణి
మండలంలోని తోర్నాల గ్రామంలోనీ మోయ తుమ్మెద వాగు పైన స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన చెక్ డ్యాం బ్రిడ్జి నిండుకుండల నిండి క్రిందికి ప్రవహిస్తుండడంతో వగలబోయిన పరశురాములు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మండల ప్రెసిడెంట్ కోల సాయిలు మరియు తాజా మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్, మరియు ఉప సర్పంచ్ గ్రామ వార్డు మెంబర్లు మరియు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు,గ్రామ రైతులు మరియు మహిళలు పాల్గొని ఆనందంతో గంగమ్మ తల్లికి పూజలు చేశారు.

