*తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్…?*
*గాంధీభవన్‌లో ప్రత్యక్షమైన థాక్రే..!*
*మీనాక్షి స్థానంలో ఎవరు..?*
*సెప్టెంబర్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్‌చార్జ్ మార్పు పై ప్రచారం జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ గాంధీ భవన్‌లో నిర్వ హించిన వినాయక పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ వ్యవ హారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రే అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన గాంధీ భవన్‌కు రావడం వెనుక ఏదైనా రాజకీయ కారణం ఉందా..? అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొద లైంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తుత ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను బాధ్యతల నుంచి తప్పించనున్నా రంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఉన్నత చదువుల కోసం సుమారు 10 నెలల పాటు విదే శాలకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్య వేక్షించేందుకు కొత్త ఇన్ చార్జ్‌ను నియమించే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.
*పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు…*
మీనాక్షి నటరాజన్ మార్పు అంశం పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన సమయంలో మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్ల బోతున్నట్లు తెలుస్తోందని, అయితే ఈ విషయంలో ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో తమకు తెలియదని ఆయన పేర్కొన్నారు.
*మీనాక్షి స్థానంలో ఎవరు…?*
మీనాక్షి నటరాజన్ 2025 ఫిబ్రవరి 14న తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బాధ్య తలు చేపట్టారు. అంతకు ముందు మాణిక్‌రావు ఠాక్రే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ను పర్య వేక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్థానంలో దీపా దాస్ మున్షీని ఏఐసీసీ నియ మించింది. అనంతరం దీపా దాస్‌మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు మీనాక్షి విదేశాలకు వెళ్ల నున్న నేపథ్యంలో కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించే అంశంపై ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రేసులో ముకుల్ వాస్నిక్ , దిగ్వి జయ్ సింగ్ , శక్తిసింహ్ గోహిల్ , అశోక్ గెహ్లాట్ పేర్లు వినిపిస్తుండగా గాంధీ భవన్ లో పూజా కార్య క్రమానికి మాణిక్ రావు హాజరుకావడంతో అధిష్టానం రాష్ట్ర ఇన్ చార్జిగా మరోసారి థాక్రేనే పంపబోతోందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
*కీలక సమయంలో ఇన్‌చార్జ్ మార్పు…?*
మీనాక్షి నటరాజన్ స్థానంలో మరో ఇన్ చార్జి నియామకం జరిగితే అది కీలక సమయంలో మార్పు గా మారనుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు బహిరంగంగానే కని పిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎదురు కానున్నాయి. ఇలాంటి కీలక సమయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ను సమన్వయం చేస్తూ పార్టీ నేతలను ఏక తాటిపైకి తీసుకెళ్లే బాధ్య తను అధిష్టానం ఎవరికి అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్…?
RELATED ARTICLES

