📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJayashankar Bhupalpallyటేకుమట్ల పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

టేకుమట్ల పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

📰 Generate e-Paper Clip

ప్రజావాణి/టేకుమట్ల: జిల్లాలో ప్రజలకు పోలీసుల సేవలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్ ఆదేశించారు. బుధవారం రోజున టేకుమట్ల పోలీస్‌స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పలు రికార్డులను, పెండింగ్‌ కేసుల దర్యాప్తు, పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్‌ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.కేసుల దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు మరింత నాణ్యమైన, పారదర్శకమైన పోలీస్‌ సేవలను అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌హెచ్‌వో అమూల్య, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.