📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅంగన్వాడీలే పోషణకు పునాది.

అంగన్వాడీలే పోషణకు పునాది.

📰 Generate e-Paper Clip

అంగన్వాడీలే పోషణకు పునాది.

 ప్రతి ఇంటికీ ఆరోగ్య భరోసా

 

9వ జాతీయ పోషణ మాసం పోస్టర్ ఆవిష్కరణ

 

మన. అంగన్వాడి

మనబాధ్యత’తో పోషణ మాసం

 

సెప్టెంబర్ 9

నుంచి అక్టోబర్ 8 వరకు విస్తృత కార్యక్రమాలు

 

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

 

మెదక్ జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్

 

మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలను పోషకాహారం, ఆరోగ్యం, అవగాహనకు కీలక వేదికలుగా ఉపయోగించుకుని ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

‘మనం అంగన్వాడి–మన బాధ్యత’ అనే సందేశంతో సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించే 9వ జాతీయ పోషణ మాసంలో భాగంగా జిల్లావ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మాతా, శిశు సంరక్షణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంతో పాటు వాటి ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ, వారి వయసు, అవసరాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన పోషకాహారంపై అవగాహన కల్పించాలన్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాలను గుర్తించి సకాలంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

పోషణ మాసం సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల స్థాయిలో పోషకాహారం, తల్లి–శిశు సంరక్షణ, ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

అనంతరం 9వ జాతీయ పోషణ మాసం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆవిష్కరించారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, డీఈఓ రాజు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.