📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎంబేరు మన్నారు స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

ఎంబేరు మన్నారు స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

📰 Generate e-Paper Clip

*ఎంబేరు మన్నారు స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: కొమ్మూరి ప్రతాప్ రెడ్డి*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి):
జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలం కిష్టంపేట గ్రామంలోని ఎంబేరు మన్నారు స్వామి దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం నూతనంగా నియమితులైన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
నూతన పాలకమండలి సభ్యులుగా జొర్రీగల మల్లారెడ్డి, పెద్దకుల కనకయ్య, ఆకుల సత్తయ్య, లింగమల్లి వెంకటయ్య, శ్రీమతి మాదాసు స్వప్న నియమితులయ్యారు. వీరిలో జొర్రీగల మల్లారెడ్డిని చైర్మన్‌గా నియమించారు.
ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎంబేరు మన్నారు స్వామివారి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కిష్టంపేట నుండి ఎంబేరు మన్నారు దేవాలయం వరకు మరియు కొమురవెల్లి బండగుట్ట నుంచి స్వామివారి దేవాలయం వరకు రహదారి మరమ్మతులు చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే దేవస్థానానికి సంబంధించిన భూములు ఆక్రమణకు గురైతే వాటిని తిరిగి దేవస్థానం ఆధీనంలోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని తెలిపారు. స్వామివారి దీవెనలతో జనగామ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్, చేర్యాల మండల అధ్యక్షుడు మంజ మల్లేశం, పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, మద్దూరు అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, పాక్స్ చైర్మన్ మెరుగు కృష్ణ, కిష్టంపేట సర్పంచ్ పంజల జ్యోతి మల్లేశం, నూతన పాలకమండలి సభ్యులు, కొమురవెల్లి, చేర్యాల మండల నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.